రాష్టాన్రికి జరిగిన అన్యాయంపైనే తమ పోరాటం: మంత్రి సోమిరెడ్డి
నెల్లూరు,ఏప్రిల్20(జనంసాక్షి): రాష్టాన్రికి జరిగిన అన్యాయంపైనే తమ పోరాటమని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సిఎం చంద్రబాబు చేపట్టిన ‘ధర్మ పోరాట దీక్ష’కు మద్దతుగా సోమిరెడ్డి నెల్లూరు జిల్లా వెంకటాచలంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎపికి హౌదా పదేళ్లు ఇవ్వాలని ఆనాడు బీజేపీ నేతలే పట్టుబట్టిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రంపై దశలవారీగా తమ పోరాటం ఉంటుందని సోమిరెడ్డి పేర్కొన్నారు. కుట్రలో భాగంగానే బిజెపిపై జగన్
విమర్శలు చేయడం లేదన్నారు. పీఎంవో చుట్టూ విజయసాయిరెడ్డి ప్రదక్షిణలు చేయడాన్ని ఏమను కోవాలని ఆయన ప్రశ్నించారు. ఆ పార్టీ పోరాటం చేయాల్సింది టిడిపిపై కాదని… కేంద్రంపైనని సోమిరెడ్డి సూచించారు. మిత్రపక్షాలను బిజెపి మోసం చేస్తోందని మంత్రి తీవ్రస్థాయిలో విమర్శించారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో చంద్రబాబు తలపెట్టిన ధర్మపోరాటం దీక్షకు మద్దతుగా ఎమ్మెల్యే బలినేని వెంకట రామారావు దీక్షలో పాల్గొన్నారు. ఈ దీక్షలో అన్ని మండలాల కన్వీనర్లు ఎంపిటిసిలు సర్పంచ్లు పాల్గొన్నారు సభాధ్యక్షులుగా సభాధ్యక్షులుగా ఉదయగిరి సర్పంచ్ మోబిన.రియాజ్ నిర్వహించారు.