Saturday, 7 November 2026

రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ

అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన ఎన్నికల సంఘం

అధికారులతో సవిూక్షించిన రావత్‌

ఎన్నికలను సజావుగా నిర్వహిస్తామన్న రావత్‌

హైదరాబాద్నవంబర్‌23(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ఎన్నికలను ప్రశా3ంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రావత్‌ తెలిపారు. ఎన్నికలకు సంబంధించి అన్‌ఇన ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు.

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన

కమిషనర్‌ ఓపీ రావత్‌ బృందం హైదరాబాద్‌ వచ్చింది. పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయింది. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇచ్చిన విజ్ఞప్తులను స్వీకరించింది. టీఆర్‌ఎస్‌ నుంచి ఎంపీ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి ఎన్నికల సంఘాన్ని కలిశారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల గుర్తు అయిన కారును పోలిన ఆటో, టోపీ, రోడ్డు రోలర్‌, ట్రక్‌ వంటి గుర్తులను ఈ ఎన్నికల్లో ఎవరికీ కేటాయించవద్దని ఈసీని కోరినట్టు ఎంపీ వినోద్‌ తెలిపారు. 2014 ఎన్నికల్లో ఒక అభ్యర్థికి కేటాయించిన ఆటో గుర్తు తమ పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థి ఓడిపోవడానికి కారణమైందని వివరించామన్నారు వినోద్‌. ఖానాపూర్‌ అసెంబ్లీ

నియోజకవర్గంలో ఒక అభ్యర్థికి ఆటో గుర్తు కేటాయించారని, దానిని తొలగించాలని కోరినట్టు చెప్పారు. సమాజ్‌వాదీ బ్యాక్‌వర్డ్‌ పార్టీకి ట్రక్‌ గుర్తు ఇచ్చారని, దీనిపై పునరాలోచన చేయాలన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలోని టీవీ చానల్స్‌ లో ప్రకటనలు ఇస్తున్నారని, వాటిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు ఎంపీ వినోద్‌ తెలిపారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగాలని, సరైన రీతిలో భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరినట్టు వినోద్‌ వెల్లడించారు. నేరచరిత్ర ఉన్న అభ్యర్థుల ప్రకటనలపై చేసే ఖర్చును వారి ఖాతాలో జమ చేయడం సరికాదని, ఈ ఖర్చును మినహాయించాలని కోరినట్టు చెప్పారు. ఎన్నికలు సవిూపిస్తున్న వేళ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి ఓపీ రావత్‌కు రాష్ట్ర నోడల్‌ పోలీసు అధికారి జితేందర్‌ నివేదించారు. కొన్ని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిఘా పెంచామని, 10,280 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లోనూ అదనపు భద్రత ప్రణాళికలు రచించి అమలు చేయనున్నట్టు వివరించారు. ఏడు నియోజకవర్గాల్లో ఇప్పటికే గ్రేహౌండ్స్‌ బలగాలను మోహరింపజేశామని, ఇతర సిబ్బంది కూడా యాక్షన్‌ప్లాన్‌ మొదలు పెట్టినట్టు తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన 275 కంపెనీల బలగాలకుగాను ఇప్పటికే 25 కంపెనీలు రాష్ట్రానికి చేరుకొన్నాయని చెప్పారు. రాష్ట్రం నుంచి ఎన్నికల బందోబస్తుకు 38,970 మంది పోలీసులు అందుబాటులో ఉన్నారని, అలాగే 18వేల మంది పోలీసులను కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్టాల్ర నుంచి తీసుకొంటున్నట్టు వివరించారు. ఇక ఈ నెల 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.77.80 కోట్ల నగదు సీజ్‌ చేశామని, రూ.6.76 కోట్ల విలువైన 3.47 లక్షల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. 9,671 వ్యక్తిగత ఆర్మ్‌ లైసెన్స్‌ డ్‌ గన్స్‌ డిపాజిట్‌ చేసుకొన్నట్టు ఈసీ బృందానికి వివరించారు. రాష్ట్రంలో కొత్తగా ఓటర్లుగా నమోదైనవారందరికి ఇంటింటికీ తిరిగి ఓటరు కార్డులను అందిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. పాత కార్డుల కోసం ఈ-సేవా కేంద్రాల్లో 25 రూపాయలు చెల్లించి తీసుకోవచ్చని చెప్పారు. ఇకపోతే తెలంగాణ ఎన్నికల్లో పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఈసీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వయో వృద్ధులతో పాటు గర్భవతులు, బాలింతలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్‌తో పాటు ఖమ్మం, నిర్మల్‌ జిలాల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు బహుమతుల ప్రదానం సరైన చర్య కాదన్నారు. పింక్‌ పోలింగ్‌ స్టేషన్లతో పాటు ఉన్న పోలింగ్‌ కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్‌ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ దివ్యను ఈసీ బృందం ప్రశంసించారు.