Wednesday, 4 November 2026

రాష్ట్రపతి వాహనాల వివరాలు వెల్లడించలేం

2రాష్ట్రపతి వినియోగించే వాహనాల వివరాలు వెల్లడించలేమని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. దేశ ప్రథమ పౌరుడి కారు వివరాలు, రిజిస్ట్రేషన్‌ సంఖ్యను భద్రత కారణాల దృష్ట్యా వెల్లడించలేమని తెలిపింది. రాష్ట్రపతి కారు వివరాలు తెలుపాలని సమాచార హక్కు చట్టం ద్వారా దాఖలైన పిటిషన్‌ కు హోంశాఖ ఈ సమాధానం ఇచ్చింది. జాతీయ భద్రత, రాష్ట్రపతి భద్రతకు ముప్పు కలిగించే వివరాలు సమాచార చట్టం ద్వారా వెల్లడించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *