రాష్ట్రస్థాయి వికలాంగుల క్రికెట్ జట్టుకు గోపాల్ పేట్ యువకుడు ఎంపిక
క్రికెట్ కిట్ అందజేసి ప్రభాకర్ ని అభినందించిన మంత్రి నిరంజన్ రెడ్డి
గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ ( 5): మండల కేంద్రానికి చెందిన కేశపాగ ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర స్థాయి వికలాంగుల క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. ఎంపికైన ప్రభాకర్ కు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి క్రికెట్ కిట్టు ను అందజేశారు. గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి క్రికెట్ జట్టుకు ఎంపిక కావడం పట్ల ప్రభాకర్ ను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు తిరుపతి యాదవ్, నాగరాజు, బెంజిమెన్, తదితరులు పాల్గొన్నారు




