Tuesday, 3 November 2026

రాష్ట్రాభివృద్ధికే తిరుగుతున్నా: సీఎం

విజయవాడ బ్యూరో: రాష్ట్రాభివృద్ధి కోసమే తాను ప్రపంచమంతా తిరుగుతున్నానని, ఈ క్రమంలోనే దావోస్ వెళ్లివచ్చానని సీఎం చంద్రబాబు చెప్పారు. విజయవాడలోని సిద్దార్థ వైద్య కళాశాల ఆవరణలో.. సోమవారం ఆర్టీసీకి చెందిన 100 కొత్త బస్సులను, సాంకేతిక పరిజ్ఞానంతో ప్రయాణిలకు సేవలందించేందుకు రూపొందించిన అప్లికేషన్‌ను సీఎం ప్రారంభించారు. దావోస్‌లో ప్రముఖులు సైతం అమెరికా, జపాన్, చైనా గురించి అడగడంలేదని, వారంతా భారత్ వైపు చూస్తున్నారని చెప్పారు.

ప్రపంచ పరిస్థితి చూస్తే రానున్న కాలంలో అగ్ర దేశంగా ఎదిగే భారత్ మరో వందేళ్లపాటు కీలక భూమిక పోషించనుందన్నారు. ఇలాంటి తరుణంలో.. అన్ని అవకాశాలనూ అందిపుచ్చుకుని దేశంలో మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ ఎదగాలని అన్నారు. దీనికి అవసరమైన పెట్టుబడులు, సంస్థలు, కంపెనీలు, పరిశ్రమలు సాధించేందుకు తాను ప్రపంచమంతా తిరుగుతున్నట్టు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *