హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని ఎఫ్‌డీసీ కార్యాలయంలో రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ. అనిల్ కుర్మాచలం గారు జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్ర ఏర్పాటుకోసం అసువులు బాసిన ఎందరో మాహానీయుల త్యాగాలను స్మరించుకున్నారు. అమరుల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ సుపరిపాలనతో బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నదని అన్నారు.




