రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా
టేకుమట్ల ప్రభాకర్ ఎన్నిక*
ధర్మపురి (జనం సాక్షి న్యూస్) తెలంగాణ నేతకాని మహార్ హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గోమాసే స్టీరింగ్ కమిటీ చైర్మన్ బండారి కనకయ్య నాయకత్వంలో ఎన్నికలు బుధవారం నిర్వహించగా, జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని టేకుమట్ల ప్రభాకర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు అటు తరువాత ఆయనను శాలువాతో సత్కరించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సర్టిఫికెట్ అందించారు, తదనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, తెలంగాణ నేతకాని మహార్ హక్కుల సమితికి నా మీద నమ్మకంతో ఎన్నుకోవడంలో ఎంతో సంతోషకరమని ఆయన మాట్లాడుతూ,ఆల్ ఇండియా జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గోమాసే మరియు స్టీరింగ్ కమిటీ చైర్మన్ కనకయ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ మరియు వారితో నియమితులైన వారికిని ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి స్నేహితులు బంధువులు తదితరులు పాల్గొన్నారు




