రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులకు మధ్య వారధిగా ఉంటా ` కోదండరామ్‌


హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతోన్న నేపథ్యంలో రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. సచివాలయం వద్ద బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు.ఉద్యోగులతో పాటు తెలంగాణ జనసమితి (తెజస) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ కూడా సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ మాట్లాడుతూ.. ‘’ఉద్యోగ సంఘ నేతలతోనే ఉద్యోగుల హక్కులను హరించారు. కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామిక పాలన ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులకు మధ్య వారధిగా ఉంటా. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తాం’’ అని కోదండరామ్‌ అన్నారు.