చిలప్ చేడ్/జూన్/జనంసాక్షి :- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజ్ పట్ల చిన్నచూపు చూడడం సరికాదు. దశబ్ది ఉత్సవాళ్ళో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. లక్ష ఆర్ధిక సాయం అందజేసే జాబితాలో ముదిరాజ్ కులాన్ని పొందుపర్చకపోవడం సరికాదనీ అనిల్ ముదిరాజ్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముదిరాజ్ లు బిసి కులాల్లో లేరా. ముదిరాజ్ లకు కులవృత్తి లేదా అని ప్రశ్నించారు. వృత్తిదారులకే ఆర్ధిక సాయం అందిస్తామని చెప్పడం స్వాగతిస్తున్నాం, అందులో ముదిరాజ్ లను విస్మరించడం సబబు కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన అధిక ఓటింగ్ శాతన్ని కలిగి ఉన్న ముదిరాజ్ లను బిసి సంక్షేమ శాఖ ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో సమాధానం చెప్పాలన్నారు. రూ.లక్షసాయం అందించే కులాల జాబితాలో వెంటనే ముదిరాజ్ కులాన్ని కూడా చేర్చి ఉత్తర్వులు జారీ చేయాలనీ, అప్పటి వరకు ఈ పథకాన్ని నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్రంలోనైనా ముదిరాజ్ లకు న్యాయం జరుగుతుందని భావిస్తే, ఇప్పుడు కూడా అన్యాయమే జరుగుతొందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ముదిరాజ్ లకు కనీసం చేపల వేటకు వెళ్ళడానికి కావాల్సిన పరికరాలు కూడా కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నారని, ఇది ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ముదిరాజ్ లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కావాలనే జాబితాలో చేర్చలేదని విమర్శించారు. ఏ స్థాయిలో తప్పిదం జరిగిందో సమీక్షించి వెంటనే ముదిరాజ్ లకు కూడా రూ.లక్ష ఆర్థిక సాయం అందించేలా నిబంధనలు రూపొందించాలని ఆయన కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజ్ ల పట్ల చిన్నచూపు తగదు.ముదిరాజ్ లు బీసీలు కారా… అనిల్ ముదిరాజ్.




