రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కష్టాల్లో ఉన్నాడు: వెంకట్రావు
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కష్టాల్లో ఉన్నారని కాంగ్రెస్ నేత పాలడుగు వెంకట్రావు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అధ్వాన్నంగా ఆయన వెల్లడించారు. లా అండ్ ఆర్డర్ కూడా దిగజారిపోయిందని ఆయన ఎలాగోలా నెట్టు కొస్తున్నారని తెలియజేశారు. సీఎం తన తప్పులు సరిచేసుకోవాలని, లేకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ దెబ్బ తినడం ఖాయమని వెల్లడించారు. సీఎంను కలిసి అన్ని విషయాలు చెబుతాననీ ఆయన అన్నారు. ఇంకా, రాహుల్‌ను కేబినెట్‌లోకి రావాలని తాను కోరానని అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని పాలడుగు తెలియజేశారు.