న్యూఢిల్లీ (జనంసాక్షి)
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టడంపై కొనసాగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. కీలకమైన బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాహుల్ విదేశాలకు వెళ్లడమేంటని అధికార బీజేపీ సహా పలు పార్టీల నేతలు విమర్శిస్తుండగా.. రాహుల్ ఉత్తరాఖండ్‌లోనే ఉన్నాడంటూ ఓ కార్యకర్త ఆయన ఫొటోలను ఆన్ లైన్లో పోస్ట్ చేయడం కలకలంరేపింది. దేశంలోనే ఉండి కూడా ఫారిన్ టూర్ పేరుతో రాహుల్ పార్లమెంటుకు రాకపోవడం… కాంగ్రెస్ చిత్తశుద్ధిలేమికి నిదర్శనమని బీజేపీ ఫైరయింది. ఐతే కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా మాత్రం రాహుల్ ఉత్తరాఖండ్‌లో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం అసత్యమని కొట్టిపారేశారు.