Wednesday, 4 November 2026

మానసిక వికలాంగురాలిపై లైంగికదాడి

కృష్ణా:

కృష్ణా జిల్లా తిరువూరు మండలంలో ఓ మానసిక వికలాంగురాలిపై వావి వరుసలు మరిచిన కామాంధుడొకడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని వావిలాల గ్రామంలో జరిగింది. వివరాలు… గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువతి మానసిక వికలాంగురాలు. ఆమె మంగళవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వరుసకు బాబాయి అయిన హుస్సేన్ అనే వ్యక్తి లైంగికదాడికి ఒడిగట్టాడు.భాదితురాలు తల్లిదండ్రులకు చెప్పటంతో వారు బుధవారం ఉదయ తిరువూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఘటనపై విచారణ చేపట్టారు. యువతిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *