హుజూర్ నగర్ ఫిబ్రవరి 8 (జనంసాక్షి): ఏఐసీసీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సందేశాన్ని గడపగడపకు తీసుకెళ్లాలని హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. బుధవారం హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో టీ.పీ.సీ.సీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రెటరీఎండి అజీజ్ పాషా, కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు జక్కుల మల్లయ్యలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ వారి ప్రభుత్వాలలో జరుగుతున్న అవినీతిని పాదయాత్ర ద్వారా ప్రజలకు వివరించారన్నారు. ఈ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన అనేక మోసపూరిత వాగ్దానాలను ప్రజలకు తెలియపరుస్తూ ఈ పాదయాత్రను ముందుకు కొనసాగిస్తున్నారు. ఈ ప్రభుత్వాలపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత బలంగా ఉన్నదని, పాదయాత్రలో ప్రతిచోట ప్రజలు అధికార పార్టీల పనితీరుపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారన్నారు. హాస్తే హత్ జోడో అభియాన్ పాదయాత్ర ప్రారంభించగా ఈ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతూ అన్ని వర్గాల ప్రజలు తమ మద్దతును తెలియజేస్తు పాదయాత్రలో పాల్గొంటున్నారని వారు ఈ సందర్భంగా అన్నారు. ఈ పాదయాత్ర ద్వారా ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకు హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి వాహనాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలివెళ్లి యాత్రలో పాల్గొంటామని తమ సంఘీభావాన్ని మద్దతును తెలియజేస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐ ఎన్ టి యు సి పట్టణ అధ్యక్షులు పాశం రామరాజు, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ సుదర్శన్, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఇట్టిమల్ల బెంజిమెన్, మండల కో ఆప్షన్ సభ్యులు అజ్మతుల్లా, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాము, మాజీ ఉపసర్పంచ్ కోలమట్టయ్య, కస్తాల ముత్తయ్య, మాజీ వార్డ్ కౌన్సిలర్స్ కంకణాల పుల్లయ్య, సమ్మెట సుబ్బరాజు, దొంతగాని జగన్, బంటు సైదులు, దాసరి పున్నయ్య, సోమయ్య, నెల్లిట్ల రాజు, కందుకూరి రాము, ముషం సత్యనారాయణ, మధు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.




