హుజూరాబాద్ (జనం సాక్షి): కరీం నగర్ జిల్లా ఆఫీసులో విఘ్నేశ్వర ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అర్ఎంపి పిఎంపి ల సమావేశం జరిగింది.ఈ సమావేశం లో మండలం లోని ఆర్ఎంపీ,పిఎంపిలు పాల్గొని తమ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా సంగెం ఐలయ్య , అధ్యక్షుడుగా కందగట్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఎర్రోళ్ల సదానందం, కన్నబోయిన తిరుపతి , ప్రధాన కార్యదర్శిగా చిలకమారి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శిగా చిందం రామరాజు, కోశాధికారిగా చింద్యాల కమల్ సింగ్ , గౌరవ సలహాదారులుగా అడ్డగట్ల కృష్ణమూర్తి , శ్రీపతి ధనుంజయ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా శనిగరపు పరమేష్ , కార్యవర్గ సభ్యులుగా గొల్లపల్లి రమణ చారి, మామిడి రమేష్ , కుసుమ రాజు, కొలిపాక జగదీష్ , సబ్బని జగదీష్,అల్లి జగదీష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.




