-ధర్నాలో డిమాండ్ చేసిన గొంగళ్ల రంజిత్ కుమార్.గద్వాల నడిగడ్డ, ఫిబ్రవరి 8 (జనం సాక్షి);
నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండు చౌరస్తా నందు జిల్లాలోని సీడ్ పత్తి రైతులపై దళారులు చేస్తున్నటువంటి దోపిడీని అరికట్టాలని, పెట్టుబడులు పెరుగుతున్న ప్యాకెట్ పై రేట్లు పెంచడం లేదని వెంటనే రేటును పెంచాలని,మార్చిలోపు పేమెంట్లు జరిగేలా రైతులతో ఒప్పందాలు చేసుకోవాలని,2020 వ సంవత్సరం నుంచి ఫెయిల్ అయిన విత్తనాలకు రీశాంపుల్ నిర్వహించాలని ధర్నాలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు.మధ్య దళారులు అప్పుల నెపంతో రైతులతో ఓట్లువేయిస్తున్నారని ఈ బంగ్లా పాలకులు వీరి ఆగడాలను ప్రశ్నించడం లేదని, పైపచ్చు మీరు ఓట్లు వేయించి, రైతులను ఎంతైనా దోచుకోండి అన్నట్లు వీళ్ళ వ్యవహార శైలి ఉన్నదని మండిపడ్డారు.మధ్య దళారులు జీ.వో.టి ఫలితాల్లో ఫెయిల్ కాకున్నా, ఫెయిల్ అయినట్లు చెబుతూ రైతులని అప్పుల ఊబిలోకి నెట్టుతున్నారని మండిపడ్డారు. సీడ్ పత్తి వ్యవహారంలో పారదర్శకత ఉండాలంటే వ్యవసాయ శాఖకు జవాబుదారితనం ఉండాలని అన్నారు. అధికారమనే అండదండలతో చేలరేగిపోతున్న ఈ మాఫియాను అడ్డుకోవాలంటే అ అధికారం నుండి పారదోలాలని అన్నారు.ధర్నా తదనంతరం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అడిషనల్ కలెక్టర్ అపూర్వ చౌహన్ కి వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో కన్వీనర్ బుచ్చిబాబు, కార్యదర్శి లవన్న,మల్దకల్ మండల అధ్యక్షుడు విష్ణు,ఉపాధ్యక్షుడు ప్రేమ్ రాజ్,నజుముల్లా,కార్యదర్శి తిమ్మప్ప, ఉప్పరి కృష్ణ హనుమేశ్ ,గోపాల్ ధరూర్ మండల అధ్యక్షుడు నెట్టెంపాడు గోవిందు,పరశురాముడు కార్యదర్శి రాము, ఉపాధ్యక్షుడు మునియప్పగట్టు మండల
అధ్యక్షుడు సారాభాయి బలరాం ఉపాధ్యక్షుడు దయాకర్ కార్యదర్శి నరేష్ కేటి దొడ్డి మండల నాయకులు అంజి భీమన్ గౌడు,యాల్లేష్, చిన్న రాముడు, రమేష్ ఆశన్న,నేతన్న, మీసాల కృష్ణన్న, భూపతి నాయుడు రాము,జగదీష్,ఆంజనేయులు,రాజు నాయుడు,కృష్ణ,వీరేశ్ తదితరులతోపాటు ఆయా గ్రామాల అధ్యక్షులు కార్యదర్శులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




