రాహుల్ త్వరలోనే ప్రజా జీవితంలోకి వచ్చేస్తాడు:సోనియా

బాబు త్వరలోనే వచ్చేస్తాడు:సోనియా
 అమేథీ:గత కొంతకాలంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎవరికీ కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే. దానిపై ఇప్పటికే పలు పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నా.. రాహుల్ గాంధీ మాత్రం  మిన్నుకుండి పోయారు. రాహుల్ ఎక్కడకు వెళ్లారనే అంశం అటు నాయకుల నుంచి ఇటు ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.

అయితే దీనిపై రాహుల్ తల్లి, ఏఐసీసీ చైర్ పర్సన్ సోనియాగాంధీ తాజాగా స్పందించారు. రాహుల్ బాబు త్వరలోనే ప్రజా జీవితంలోకి వస్తాడంటూ స్పష్టం చేశారు. కాగా, రాహుల్ ఎప్పుడూ తిరిగి వస్తారనే దానిపై సోనియా స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉండగా పార్టీ వర్గాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. వచ్చే నెల్లో రాహుల్ తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నాయి. మాజీ నేత మహ్మద్ అయూబ్ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో పూరే దేవ్ బధే గ్రామానికి వెళ్లిన సోనియా పై విధంగా స్పందించారు. రాయ్ బరేలీ, అమేథీ నియోజవర్గాలు తమ సొంత కుటుంబాలని సోనియా ఈ సందర్భంగా పేర్కొన్నారు.