రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆవుల చెంగప్పకు నివాళులు అర్పించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ..
హన్మకొండ బ్యూరో 14 నవంబర్ జనంసాక్షి
సోమవారం నాడు కలెక్టరేట్ మీటింగ్ హల్ నందు అయన చిత్ర పటానికి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు జేసీ సంధ్యా రాణి తహసీల్దార్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు.వారి ఆత్మ శాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వరంగల్ జిల్లా కలెక్టర్ 1986 నుండి19 89 వరకు గా విధులు నిర్వహించిన అయన జిల్లా అభివృద్ధి కి ఎంత గానో తోడ్పాటు అందిచా రని అన్నారు.జిల్లా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవారని,ప్రజల సమస్య ల పై తక్షణమే స్పందించి పరిష్కరించే వారని అన్నారు.
ఈ కార్యక్రమం లో అదనపు జేసీ సంధ్యా రాణి, వాసు చంద్ర అధికారులు పాల్గొన్నారు,




