Thursday, 5 November 2026

విద్యార్థులకు పోషకాహారం పై అవగాహన

విద్యార్థులకు పోషకాహారం పై అవగాహన
వేములవాడ, నవంబర్ 14 (జనం సాక్షి) : వేములవాడ పట్టణంలోని వివేకానంద హై స్కూల్లో సోమవారం పోషకాహార అవగాహన కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి ప్రారంభించారు. విద్యార్థులు పోషక విలువలు కలిగిన వివిధ రకాల ఆహార పదార్థాలను తీసుకొని వచ్చారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాధవి మాట్లాడుతూ పిల్లల్లో చక్కటి ఎదుగుదలకు ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. ఆకుకూరలు, కోడిగుడ్లు, ఆయా సీజన్లలో దొరికే పండ్లను తినాలని పేర్కొన్నారు. పిల్లల వైద్య నిపుణులు మధు, వరప్రసాద్ ఏ ఏ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల పిల్లల కు ఏ రకంగా ఉపయోగపడతాయో వివరించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ గడీల ప్రసాద్, ప్రిన్సిపాల్ సృజన, కౌన్సిలర్లు సిరిగిరి రామచంద్రం, ఇప్పపూల అజయ్, నరాల శేఖర్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.