యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం జనం సాక్షి న్యూస్ జూన్ 26
ప్రభుత్వ పాఠశాలలో మౌనిక వసతులు కల్పించాలని ఏబీవీపీ మండల ఉపాధ్యక్షుడు కందుకూరు వేణు అన్నారు. సోమవారం తుర్కపల్లి మండలంలోని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రము లో ప్రైవేట్ కళాశాలలో ,స్కూల్స్ నందు అధిక పీజులు వసూలు చేస్తున్న యాజమాన్యం లను నియంత్రణ చేయాలనీ, ప్రభుత్వ పాఠశాలలో మౌళిక వసతులు కల్పించాలని, తెలంగాణా ప్రభుత్వం విద్యా శాఖ దీనిపై తగిన చర్యలు తీసుకొని పేద విద్యార్థుల కు అండగా ఉండాలని అన్నారు ,.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కట్కూరి గణేష్ గౌడ్,కార్యదర్శి సాయి నిఖిల్ ,SFS రాజు,అరవింద్ ,సంయుక్త కార్యదర్శి గోకుల మధు,పాముల రాజు,ఆకుల దుర్గా ప్రసాద్,ఆకుల భాను ,శివ ,భరత్,నితిన్, కృష్ణ తధిదారులు పాల్గొన్నారు.




