సుధా బ్యాంకు ఏడవ వార్షికోత్సవ ఆత్మీయ సమ్మేళనం
– సుధా బ్యాంకు చైర్మన్ మీలామహదేవ్, సీఈవో పెద్దిరెడ్డి గణేష్
హుజూర్ నగర్ జనవరి 05(జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణంలో జివిపి ఫంక్షన్ హాల్లో సుధా బ్యాంకు ఏడవ వార్షికోత్సవ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినారు. ఈ సందర్భంగా సుధా బ్యాంకు చైర్మన్ మీలామహదేవ్ సీఈవో పెద్దిరెడ్డి గణేష్ గురువారం మాట్లాడుతూ సుధా బ్యాంకు సేవలు సద్వినియం చేసుకోవాలని, ఉమ్మడి జిల్లాలో సుధా బ్యాంకు 6 శాఖల ద్వారా సుమారు 200 కోట్ల రూపాయల లావాదేవీలతో ప్రజలకు సేవలు అందిస్తుందన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు రుణ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. అర్హులైన వారందరికీ రుణాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్లు భువనగిరి భాస్కర్, వైస్ చైర్మన్ పొనుగోటి నిర్మల, కక్కిరేణి చంద్రశేఖర్, పోలిశెట్టి నరసింహారావు, బెల్లంకొండ రామచంద్ర గౌడ్, మా శెట్టి అనంతరాములు గుప్తా, పారుపల్లి చంద్రశేఖర్, అచ్చయ్య , మేనేజర్ పైడిమర్రి నరసింహారావు, సైదులు పాల్గొన్నారు.
సుధా బ్యాంకు ఏడవ వార్షికోత్సవ ఆత్మీయ సమ్మేళనం – సుధా బ్యాంకు చైర్మన్ మీలామహదేవ్, సీఈవో




