Wednesday, 4 November 2026

రుణాలతో పథకాలను సాగించాలి: కలెక్టర్‌

శ్రీకాకుళం,జూలై26(జ‌నంసాక్షి): శ్రీకాకుళం పరిషత్‌ సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్‌ ధనుంజయరెడ్డి బ్యాంకుల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. బ్యాంక్‌ సహకారం అందించాలని కోరారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ పథకాలు అమలు చేయడంలో నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో ప్రజలు నష్టపోతున్నారని చెప్పారు. సహకారం అందించని బ్యాంక్‌ అధికారులపై ఆర్‌బిఐ కి ఫిర్యాదు చేస్తామని, ఆదరణ పథకాలు అమలుచేయడంలో సహకరించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పేదలకు అందుబాటులో ఉన్న పథకాలకు నిధులు అందించాలని, రుణాలు ఇవ్వాలన్నారు.