– ఈ నెల 29న రుతుపవనాల రాక
హైదరాబాద్, మే26(జనం సాక్షి) : మాడు పగిలే ఎండలకు అల్లాడుతున్న ప్రజలకు చల్లని వార్త. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు దేశాన్ని ముందుగానే పలకరించబోతున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. శుక్రవారం దక్షిణ అండమాన్ సముద్రం నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయి. ఈ నెల 29న కేరళ తీరాన్ని తాకే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరో పక్క రాయలసీమ విూదుగా ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో రాయలసీమలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతారణ శాఖ సూచించింది.
రుతుపవనాలొచ్చేస్తున్నాయ్!




