రుద్రంగిలో ప్రశాంతంగా ముగిసిన సెస్ ఎన్నికలు
రుద్రంగి డిసెంబర్ 24 జనం సాక్షి
రుద్రంగి లో శనివారం రోజున నిర్వహించిన సెస్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. మొత్తం 1743 ఓటర్లు ఉండగా అందులో 1437 పోలైనట్లు పోలింగ్ ఆఫీసర్ తాసిల్దార్ భాస్కర్ తెలిపారు.ఎస్సై ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రదేశంలో 144 సెక్షన్ అమలు చేశారు.వేములవాడ డి.ఎస్.పి నాగేంద్ర చారి పోలింగ్ బూతులను పరిశీలించారు.ఈ నెల 26 న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ను సిరిసిల్లలో నిర్వాహిస్తారు.రుద్రంగి డైరెక్టర్ స్థానానికి ఆరుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు.ఈ ఆరుగురు అభ్యర్థుల్లో గెలుపెవరిది అనేది 26 న సాయంత్రం తేలిపోనుంది.బిఆరెస్,కాంగ్రెస్, బిజెపి, బీఎస్పీ,వైఎస్సార్టిపి,ఇలా ఐదు పార్టీల నుండి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.ఒకరు స్వతంత్ర అభ్యర్థి కావడంతో మొత్తం ఆరుగురు పోటీలో నిలిచారు.నూతన మండలం ఏర్పడిన తర్వాత మొదటి సెస్ డైరెక్టర్ స్థానం కావడంతో ఇటు అభ్యర్థుల్లో అటు ప్రజల్లో సెస్ డైరెక్టర్ గా ఎవరు గెలుస్తారో అనే ఉత్కంఠ నెలకొంది.




