Wednesday, 4 November 2026

రుద్రుర్ దేవాలయాలకు నిధుల వర్షం కురిపిస్తున్న సభాపతి

 

 

 

 

 

 

 

 

రుద్రుర్ (జనంసాక్షి): రుద్రుర్ మండల కేంద్రంలోని లక్ష్మీగణపతి ఆలయానికి, అయ్యప్ప సన్నిదాననికి, హనుమాన్ సన్నిదాననికి, శ్రీసీతరామ మందిరానికి, విఠలేశ్వర్ మందిరనికి, ఇలా చెప్పుకుంటే పోతే చాలా దేవాలయలకు నిధులను మంజూరు చేశారు, చేస్తూనే ఉన్నారు ఈ దశలోనే శుక్రవారం రోజున రుద్రుర్ మండల కేంద్రంలోని  చెరువుకట్ట వద్ద నూతనంగా నిర్మించాబోయే పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి, రూ. 20 లక్షలను మంజూరు చేసి మండల నాయకులు మరియు గ్రామ ప్రజలతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన  సమావేశంలో  సభాపతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను గురుంచి  వివరించారు, ముదిరాజ్ సంఘం కాంపౌండ్ వాల్ మరియు  కిచెన్ షెడ్డు నిర్మాణానికి 15 లక్షల రూపాయలను మంజూరు చేసారు, ఈ కార్యక్రమంలో పోచారం సురేందర్ రెడ్డి,  ఎంపిపి అక్కపల్లి సుజాత నాగేందర్, జడ్పిటీసి నారోజి గంగారం, మండల అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, సర్పంచ్ ఇందూర్ చంద్రశేఖర్,   సొసైటీ చైర్మన్ బద్దం సంజీవ్ రెడ్డి,  పత్తి రాము,   తోట సంగయ్య,   అక్కపల్లి నాగేందర్, మొద్దుల నర్సయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.