Wednesday, 4 November 2026

రూ.20కోట్లను నష్టపరిహారంగా ప్రభుత్వం అందజేస్తోంది

వాషింగ్టన్‌ : ముగ్గురిని కాల్చిచంపాడమే నేరంపై ఫిబ్రవరి నెలలో లాన్‌ఏంజిల్స్‌ పోలీసు శాఖకు చెందిన అధికారి క్రిస్టఫర్‌ డార్నర్‌ను పట్టుకునే క్రమంలో దినపత్రికనలను పంపిణీ చేస్తున్న ఇద్దరు మహిళలను పోలీసు అధికారులు గాయపరిచారు. ఈ క్రమంలో వారి కారును 100 రౌండ్ల తూటలతో ధ్వంసం చేశారు. వీరివురికి లాన్‌ఏంజిల్స్‌ ప్రభుత్వం రూ.20కోట్లు (4.2 మిలియన్‌ డాలర్లు) నష్టపరిహారం రూపంలో అందజేస్తోంది. మార్గీ కరనెజా, ఎమ్మో హెర్నాండెజ్‌ ఇరువురు తెల్లవారుజామున దినపత్రికలు పంపిణీ చేస్తుండగా ముందస్తు హెచ్చరికలు లేకుండా పోలీసులు కాల్పులు జరపగా మార్గీకు వెన్నులో రెండు తూటాలు దూసుకెళ్లాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *