Thursday, 5 November 2026

రూ.5 లక్షల విలువైన గుట్కాలు పట్టివేత

రామభద్రపురం: అక్రమంగా గుట్కాలు, ఖైనీలు తరలిస్తున్న వ్యక్తులను విజయనగరం జిల్లా రామభద్రపురం పోలీసులు బుధవారం మధ్యాహ్నం పట్టుకున్నారు. వైజాగ్ నుంచి విజయనగరం జిల్లాలోని సాలూరుకు వెళుతున్న భారత్ మోటార్ పార్సిల్ సర్వీసు లారీని రామభద్రపురం పోలీసులు ఆపి తనిఖీ చేశారు.

ఈ సందర్బంగా రూ.5 లక్షల విలువ చేసే గుట్కాలు, ఖైనీలు బయటపడ్డాయని, వాటిని స్వాధీనం చేసుకుని డ్రైవర్ సత్యనారాయణను అరెస్ట్ చేసినట్టు ఎస్‌ఐ సంతోష్‌కుమార్ తెలిపారు. అనంతరం భారత్ మోటార్ పార్సిల్ సర్వీసు సాలూరు ఏజెంట్ వేణుగోపాల్‌ను కూడా అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *