దేశంలోనే ఎత్తయిన కట్టడంగా చరిత్ర: నారాయణ
హైదరాబాద్,నవంబర్24(జనంసాక్షి): అమరావతిలో కొలువుదీరనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనుంది. దేశంలోనే ఎత్తైన కట్టడంగా నిలవనుంది. పటేల్ స్మృత్యర్థం నర్మదా నదీ తీరంలో నిర్మించిన ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని మించి ఉండేలా ఈ నిర్మాణం చేపట్టనున్నట్టు సమాచారం. కృష్ణమ్మ తీరంలో నిర్మిస్తున్న ఏపీ అసెంబ్లీ డిజైన్లను నార్మన్ ఫోస్టర్స్ తాజాగా విడుదల చేసింది. డిజైన్లను ఏపీ సీఎం ఆమోదం తెలిపారు. తాజా డిజైన్ల ప్రకారం పటేల్ విగ్రహం కంటే 68 విూటర్లు ఎత్తులో ఏపీ అసెంబ్లీ నిర్మాణం ఉండనుంది. మూడు అంతస్తుల్లో అసెంబ్లీ నిర్మిస్తుండగా.. దానిపైన ఉండే టవర్ చాలా ఎత్తులో ఉండనుంది. ఎత్తులో ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ 182 విూటర్లు ఉండగా, ఏపీ అసెంబ్లీ 250 విూటర్లు. నవంబర్‌లోపు టెండర్ల పక్రియ పూర్తి చేసి.. రానున్న రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయనున్నామని మంత్రి నారాయణ ప్రకటించారు.




