Friday, 6 November 2026

రెండోరోజుకు జవహర్‌ పాదయాత్ర

బాబు మళ్లీ సిఎం అవుతారని వ్యాఖ్య

ఏలూరు,నవంబర్‌15(జ‌నంసాక్షి): కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వెంకన్న స్వామికి పాద యాత్రగా వెళ్లి నివేదిక ఇవ్వనున్నట్లు మంత్రి జవహర్‌ పేర్కొన్నారు. పాదయాత్రకు వస్తున్న విశేష ఆదరణ

చూసి వైసిపి నాయకురాలు తప్పుడు కూతలు కూస్తుందని మండిపడ్డారు. చంద్రన్న మళ్ళీ అధికారంలోకి రావడానికి నవ్యాంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు.త్రి జవహర్‌ ద్వారక తిరుమల యాత్ర గురువారంతో రెండో రోజుకు చేరింది. ఈ యాత్రకు ఎంపిలు మురళీ మోహన్‌, తోట సీతారామలక్ష్మి, నిడదవోలు ఎమ్మెల్యే శేషారావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జవహర్‌ మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు మళ్ళీ నువ్వే కావాలి ‘ అని కోరుకుంటూ చేపట్టిన ఈ యాత్ర రెండో రోజు ప్రజాదరణతో పసివేదలలో ప్రారంభమై పోతవరంలో ముగుస్తుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు దమ్మున్న నేత అని, మళ్లీ ఆయనే సీఎం అవుతారని జవహర్‌ అన్నారు. చంద్రబాబును వదులుకుని తప్పు చేశామని బీజేపీ నేతలు బాధపడక తప్పదని అన్నారు. దేశంలోని రాజకీయ పార్టీలన్నింటినీ చంద్రబాబు ఏకం చేసి మోదీని గ్దదెదించుతారని జగన్‌, పవన్‌ భయపడుతున్నారన్నారు. చంద్రబాబు స్థాయికి ఎదగాలంటే జగన్‌, పవన్‌ హిమాలయాల్లో తపస్సు చేయాలన్నారు. పవన్‌ కేడర్‌లేని లీడర్‌ అని, కులాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమె త్తారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న జగన్‌, తనకు గన్‌మన్‌లు, పాదయాత్రలో రక్షణగా నిలిచిన వారు ఏపీ పోలీసులేనన్న విషయం మరిచారని అన్నారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మి తన కుమారుడిని ప్రజలే కాపాడుకో వాలని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్‌ మోదీతో కుమ్మక్కై చంద్రబాబును దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.