Wednesday, 4 November 2026

రెండోవిడత పంచాయితీ ప్రచారానికి తెర

25న పోలింగ..అదేరోజు కౌంటింగ్‌

రెండురోజుల పాటు మద్యం దుకాణాల మూసివేత

భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు, పోలీసులు

హైదరాబాద్‌,జనవరి23(జ‌నంసాక్షి):రెండో విడత పంచాయితీ ఎన్నికలకు రంగం సిద్దం అయ్యింది. తొలివిడత 21న ముగిసి ఫలితాలు వెల్లడి కాగా రెండో విడత 25న జరుగనున్నాయి. దీంతో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. ఈనెల 25న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగనున్‌ఆనయి. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రంతో ప్రచారపర్వానికి తెరపడింది. రాష్ట్రఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు గడువు ముగిసింది.ఈ నిబంధనను ఎవరైనా ఉల్లంఘించి ప్రచారం నిర్వహిస్తే ఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హత వేటు పడుతుంది. గడువు ముగిసిన తర్వాత అభ్యర్థులు నేరుగా కానీ టీవీ, విూడియా, పత్రికల్లోనూ ప్రచారం చేయరాదని ఈసీ ఇప్పటికే స్పష్టం చేసింది. రెండో విడతలో 4,137 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. 4,137 పంచాయతీల్లో 1 లక్షా 7 వేల 430 మంది

అభ్యర్థులు బరిలో ఉన్నారు. సర్పంచ్‌ స్థానాలకు 20 వేల 575 మంది, వార్డు స్థానాలకు 86 వేల 855 మంది పోటీ పడుతున్నారు. ఈనెల 25న ఉదయం 7 గంటల నుండి ఒంటిగంట వరకు పోలింగ్‌ జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి లెక్కింపు ఉంటుంది. అనంతరం అధికారులు ఫలితాలను ప్రకటిస్తారు. రెండోవిడతలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ఫలితాలను ప్రకటించే వరకు ఆయా ప్రాంతాల్లో మద్యం దుకాణాల మూసివేత కొనసాగుతుంది. మరోవైపు జనవరి 30న మూడో విడత

ఎన్నికలను నిర్వహిస్తారు. థర్డ్‌ ఫేజ్‌ లో 4,115 గ్రామాల్లో ఎలక్షన్‌ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు ,పోలీసులు గ్రామాల్లో చర్యలు తీసుకున్నారు.