రఘునాథ పాలెం జనవరి 19 జనం సాక్షి
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని నిన్న కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవంలో గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా రఘునాథపాలెం మండలం ,జింకల తండా గ్రామములో కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించిన జడ్పీటీసీ మాలోతు ప్రియాంక . ఈ కార్యక్రమంలో భాగంగా స్పెషల్ ఆఫీసర్ విజయ , ఎంపీడీఓ రామకృష్ణ , సర్పంచ్ మోతిలాల్ ,ఉప సర్పంచ్ వైద్య అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు .




