రుద్రుర్ (జనంసాక్షి): రుద్రుర్ మండల ఐకెపి, విఓఏ నిరవధిక సమ్మె 15 వ రోజుకు చేరింది, వీరికి మద్దతు తెలుపుతూ రుద్రుర్ మండల బీజీపీ అధ్యక్షుడు సుధాకర్ గౌడ్ మండల కార్యకర్తలతో కలిసి తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయమైన వివోఏ ల డిమాండ్లు పరిశీలించి న్యాయం చేయాలని కోరురూ, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో సీఎం కేసీఆర్ కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి ఏమి వాగ్దానలు ఇచ్చారో గుర్తు చేశారు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎంతో ప్రయోజనం చేకూరుస్తున్న వివోఏ లపై జాలి కలగడం లేదా అని అడిగారు, వారికి ఇచ్చే వేతనాల వాళ్ళు చేసే పనికి పొంతన లేకుండా ఉంది అని, తెలిపారు, వీరి డిమాండ్లను వెంటనే పరిష్కరించాకుంటే , బిజెపి పార్టి కూడా వారి వెంట వుండి న్యాయ పోరాటం చేయాల్సి వుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, శంకర్ పటేల్, బొప్పపూర్ సాయిలు, హరి, కృష్ణ రాజు, శివ, గంగాధర్ , ప్రసాద్ ,సావిత్రి, గంగామణి, కరుణ, గంగాధర్, సాయిబాబా, మాణిక్యమ్మ, సవిత, సరిత, లావణ్య, స్వరూప, కమల, రిజ్వాన, లలిత, జరీనా, తబస్సుమ్, జ్యోతి, నాగరాణి, జిజియబాయి, వీరేశం, చంద్రకాంత్, గంగారాం మరియు తదితరులు పాలుగొన్నారు
విఓల సమ్మెలో మండల బీజీపీ నాయకులు




