రెండో విడత కంటి వెలుగు విజయవంతం చేయాలి
టేకులపల్లి, జనవరి 10( జనం సాక్షి ): ఈనెల 18వ తారీకు నుండి రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమవుతుండడంతో విజయవంతం చేయాలని సులానగర్ పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ దినేష్ , మద్రాస్ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ మాలోత్ రాజేందర్ నాయక్, సులానగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అజ్మీర బుజ్జి కోరారు. మంగళవారం సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ దినేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కంటి వెలుగు ప్రచార కరపత్రాలనుఆవిష్కరించారు.మండలంలోని అధికారులు, ప్రజాప్రతినిధులతో కంటి వెలుగు విజయవంతం కావడానికి కావాల్సిన విధి విధానాలపై సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమానికి రెవిన్యూ ఇన్స్పెక్టర్ రత్తయ్య, కార్యదర్శి బాలకృష్ణ,పంచాయతీ కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులతో పాటు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సీతమ్మ,పబ్లిక్ హెల్త్ నర్స్ సత్యవతి, సూపర్వైజర్లు నాగు బండి వెంకటేశ్వర్లు,పోరండ్ల శ్రీనివాస్, గుజ్జా విజయ,వీసం శకుంతల, తదితరులు పాల్గొన్నారు.




