రెడ్డిల అభివృద్ధి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.

రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కూర అంజిరెడ్డి. రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 22. (జనంసాక్షి). రాష్ట్రంలో రెడ్డిల సంక్షేమం కోసం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కూర అంజిరెడ్డి అన్నారు. మంగళవారం రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బహుదూర్ వెంకటరామిరెడ్డి 154వ జయంతి వేడుకలను నిర్వహించారు. పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన రెడ్డి విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. అనంతరం రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కూర అంజిరెడ్డి మాట్లాడుతూ రెడ్డిల సంక్షేమం కోసం బహుదూర్ వెంకట్రామిరెడ్డి అందించిన సేవలను కొనియాడారు. ఆయన అందించిన స్ఫూర్తితో రెడ్డిలందరూ ఐక్యతతో ముందుకు వెళితే రాజకీయంగా అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు అన్ని రంగాల్లో రెడ్డి సామాజిక వర్గం ముందు వరసలో ఉంటుందని తెలిపారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ నేలకొండ అరుణతో పాటు పలువురు నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ముద్దురి రామ్ రెడ్డి. లింగారెడ్డి, సతీష్ రెడ్డి, కమలాకర్ రెడ్డి, పాశం రాజేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.