రేగోడ్ //జనం సాక్షి // జనవరి :74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మండల కేంద్రమైన రేగోడ్ తో పాటు అన్ని గ్రామాల్లో ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలు, యువజన సంఘాలు, వివిధ పార్టీ కార్యాలయాలు,ప్రధాన కూడళ్ల వద్ద మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. రేగోడు తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ లక్ష్మణ్, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై సత్యనారాయణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద, డాక్టర్ శ్వేత, గాంధీ చౌక్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ బాదనపల్లి నర్సింలు, ఆదర్శ పాఠశాల వద్ద ప్రిన్సిపల్ జయప్రకాశ్, ఏపీజీవీబీ వద్ద మేనేజర్ మున్నా, ప్రెస్ క్లబ్ వద్ద ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శంకర్ గౌడ్,వివిధ పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలు ప్రధాన కూడళ్ళు, యువజన సంఘాల ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల్లో జండాలను ఎగరవేశారు. రేగోడు ఆదర్శ పాఠశాలలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆకట్టుకున్నాయి,
రెపరెపలాడిన మువ్వన్నెల జెండా




