Wednesday, 4 November 2026

సీతారాముల కళ్యాణానికి తలంబ్రాలు ఏర్పాటు.

 

 

 

 

 

 

ఫొటో : తలంబ్రాలు సిద్ధం చేస్తున్న వాసవి మహిళా మండలి సభ్యులు.
బెల్లంపల్లి, జనవరి 26, (జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో రాముల వారి కళ్యాణం కోసం గోటితో వెలిచిన ఒక లక్ష ఒక 1000 తలంబ్రాలకు గురువారం వసంత పంచమిని పురస్కరించుకొని ప్రారంభించారు. బెల్లంపల్లి శ్రీ వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో మార్చి 30న బెల్లంపల్లి లోని శ్రీ కోదండ రామాలయంలో జరగబోయే శ్రీరాముని కళ్యాణ మహోత్సవానికి 1,10,000 తలంబ్రాలను సిద్ధం చేయనున్నారు. ఈసందర్భంగా శ్రీ వాసవి మహిళా మండలి అధ్యక్షురాలు బాల విజయలక్ష్మి మాట్లాడుతూ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో బెల్లంపల్లి వాసవి మహిళలందరినీ భాగస్వామి చేయాలని నిశ్చయించుకొని స్వామివారి సేవ కోసం ఒక లక్ష ఒక వెయ్యి గోటితో వచ్చిన తలంబ్రాలను సిద్ధం చేయాలని నిశ్చయించుకొని ఈరోజు వసంత పంచమిని పురస్కరించుకొని బెల్లంపల్లి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య మహిళలందరితో కార్యక్రమం ప్రారంభిచామన్నారు. మార్చి 30న బెల్లంపల్లి లోని శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అందజేస్తున్నామని తెలిపారు. ఇంతటి గొప్ప కార్యక్రమంలో బెల్లంపల్లి లోని ఆర్యవైశ్యుల మహిళలందరూ పాల్గొనడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు చిలువేరు పద్మావతి, ప్రధాన కార్యదర్శి చిలివేరు నికిత, పల్లెర్ల సింధుజ, కన్వీనర్లు నరేందుల లక్ష్మి, నరేందుల సంజన, కార్యవర్గ సభ్యులు తనకు అన్నపూర్ణ, బాల అవంతి, రేవతి, సుజాత, సారిక, మహిళలు పాల్గొన్నారు