మోత్కూరు జనవరి 26 జనంసాక్షి : 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మండలంలోని పొడిచేడు గ్రామంలో ఆరాధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ శాఖ అధ్యక్షుడు నర్రె సురేష్ కుమార్ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన, దళిత, గిరిజన వర్గాలకు ఎన్నో హక్కులు, విద్యా, రాజకీయ, ఉద్యోగ రంగాల్లో కల్పించిన రిజర్వేషన్లకు, రక్షణలకు రూపం ఇచ్చిన రోజు కావడం వల్ల ఇది మనకు గొప్ప జాతీయ పండగ అని అన్నారు. గణతంత్ర రాజ్యం అంటే.. ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం.ఈ రోజు భారతీయులందరీకి ఎంతో ప్రత్యేకమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పేలపూడి మధు,సింగిల్ విండో వైస్ చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు,వార్డు సభ్యులు దేందే యాదగిరి,బుంగ పరమేష్, మల్లం లక్ష్మి, జిట్ట వీరమ్మ, ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు లెంకలపల్లి బిక్షం, ఉపాధ్యక్షుడు పర్వతం షణ్ముఖ చారి,కార్యదర్శులు కాసార్ల సైదులు, జిట్ట సైదులు,నాయకులు జెట్ట కృష్ణ,కాసర్ల రమేష్ ,బండ సురేష్,ప్రాథమిక,ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రతిమ, అండాలు,విద్యార్థిని విద్యార్థులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




