Wednesday, 4 November 2026

రెవిన్యూ ఉద్యోగుల రక్తదాన శిబిరం.

 

 

 

 

 

తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా మంచిర్యాల మండల
తాసిల్దార్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో టీఎన్జీవో ఫంక్షన్ హాల్ లో రక్తదాన శిబిరాన్ని
మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్ మరియు బి రాహుల్ ఐఏఎస్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని తాసిల్దారుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామని అన్నారు.ఇట్టి రక్తాన్ని మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటీ వారు సేకరించి తలసేమియా వ్యాధిగ్రస్తులకు, కిడ్నీ డయాలసిస్ బాధితులకు, గర్భిణీ స్త్రీలకు, ఉపయోగిస్తారని అన్నారు.
అనంతరం రక్తదాతలకు ప్రశంస పత్రాలను అందజేసి వారిని అభినందించారు.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ చేతుల మీదుగా జైపూర్ మండల తాసిల్దార్ రాజేశ్వర్ గారిని ఘనంగా శాలువాతో సన్మానించడం జరిగినది.
రక్త దాన శిబిరంలో 100 మంది రక్తదానం చేశారని అన్నారు.
ఈ కార్యక్రమంలో
మంచిర్యాల ఆర్డీవో వేణు,
, మంచిర్యాల తాసిల్దార్ రాజేశ్వర్, ట్రేసా జిల్లా ప్రెసిడెంట్ ఈ.కిషన్,ట్రేసా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు దేశ్ పాండే,
ట్రేసా జిల్లా కార్యదర్శి
ఎల్.కృష్ణ ,ట్రేసా జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కే.తిరుపతి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా వైస్ చైర్మన్ చందూరు మహేందర్, జిల్లా కోశాధికారి పడాల రవీందర్,
మంచిర్యాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు వి.మధుసూదన్ రెడ్డి,కాసర్ల శ్రీనివాస్, ఎడ్ల కిషన్, వైద్యులు డాక్టర్ అభినవ్, రమేష్
తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్, తాసిల్దార్ సిబ్బంది మరియు రేషన్ డీలర్లు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు