Tuesday, 3 November 2026

రెస్పిరేటరీని విడుదల చేసిన ఎయిర్‌ ఫిజియో – మెడ్‌స్మార్ట్‌

ఖైరతాబాద్ : అక్టోబర్ 14 (జనం సాక్షి)  భారత దేశంలో ప్రజల జీవితాలను సమూలంగా మార్చడంలో సహాయపడేందుకు ఆస్ట్రేలియాలో బహుళ అవార్డులు గెలుచుకున్న శ్వాసకోశ పరికరాలు(రెస్పిరేటరీ డివైజస్‌)ను భారతదేశానికి తీసుకువచ్చేందుకు మెడ్‌స్మార్ట్‌ తో ఎయిర్‌ఫిజియో భాగస్వామ్యం చేసుకుంది. రెండు సంవత్సరాల వ్యవధిలో ఐదు దేశాల నుంచి 100 దేశాలకు విస్తరించడంతో పాటుగా అర మిలియన్‌ మందికి పైగా ప్రజలకు జీవిత నాణ్యత మెరుగుపరచడంలో సహాయపడిన ఎయిర్‌ ఫిజియో ఇప్పుడు భారతదేశంలో లభ్యమవుతుంది. అపోలో హాస్పిటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీతా రెడ్డి సమక్షంలో ఆస్ట్రేలియన్‌ క్రికెట్‌ లెజండ్‌ బ్రెట్‌ లీ ఈఎయిర్‌ ఫిజియో మరియు బెటర్‌ బీత్రింగ్‌ గ్రూప్‌ ఉత్పత్తుల శ్రేణిని భారతదేశంలో విడుదల చేశారు. ఎయిర్‌ ఫిజియో, బెటర్‌ బ్రీతింగ్‌ గ్రూప్‌ గ్లోబల్‌ సీఈఓ పౌల్‌ ఓ బ్రియాన్‌ మాట్లాడుతూ మెడ్‌స్మార్ట్‌తో భాగస్వామ్యం చేసుకోవడంతో పాటుగా అపోలో గ్రూప్‌తో భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా భారతదేశంలో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి సహాయపడనున్నమని అన్నారు.