లండన్ : బ్రిటిష్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్ రేపటినుంచి మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఆయన భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయి పలు అంశాలపై చర్చలు జరుపుతారు. ఆయనతో పాటు ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధుల బృందం కూడా భారత్ వస్తోంది. ఈ బృందం ముంబయిలో హిందుస్థాన్ యూనీలీవర్ హెడ్‌క్వార్టర్స్‌ని సందర్శస్తుంది. తాజ్ ప్యాలన్ హోటల్లో వ్యాపార సమావేశం జరుపుతుంది. పోలీస్ మెమోరియల్ వద్ద నివాళి ఘటించి సెయింట్ జేవియర్ పాఠశాలను సందర్శస్తుంది.




