విశాఖ : ఏప్రిల్ 11 నుంచి 14 వరకు హైదరాబాదులో ప్రపంచ పర్యాటక సదస్సు నిర్వహించనున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తెలిపారు. ఆకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కించకుండా ఆదుకోవాలని ఆయన కోరారు. సుబ్బిరామిరెడ్డి పర్యవేక్షణ బాధ్యత తీసుకుంటానంటే విశాఖల్లో బ్లడ్‌బ్యాంక్ ఏర్పాటుచేస్తామని చిరంజీవి ప్రకటించారు.




