Wednesday, 4 November 2026

రేపటి నుంచి ఆర్టీసీ కార్మికుల రాష్ట్రవ్యాప్త సమ్మే

హైదరాబాద్‌: శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు దిగనున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఆర్టీసీ యాజమాన్యంతో చర్చల అనంతరం కార్మిక సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. వేతన సవరణపై ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదని వారు తెలిపారు. కాంట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణపై లిఖిత పూర్వక హామీ ఇచ్చేందుకు యాజమాన్యం నిరాకరించిందని చెప్పారు. ఒప్పంద కార్మికులను దశల వారీగా క్రమబద్దీకరిస్తామన్న ఆర్టీసీ యాజమాన్య హామీని తాము అంగీకరించలేదన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించేవరకు సమ్మె యోచన విరమించేది లేదని తేల్చిచెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *