రేపు ఇల్లందులో జరిగే కాంట్రాక్ట్ కార్మికుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి.. షేక్ యాకుబ్ షావలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు
బొగ్గు పరిశ్రమల్లో పనిచేస్తున్న 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు తమ రెక్కలు ముక్కలు చేసుకుని పని చేస్తు సంస్థకు కోట్ల రూపాయల ఆదాయం వచ్చే విధంగా పని చేస్తున్నరాణి రాష్ట్ర అధ్యక్షులు షేక్ యాకుబ్ షావలి అన్నారు.ఈ కార్మికులజీతం పట్టుమని పదివేలు దాటడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.10 సెప్టెంబర్ 23న, ఉదయం 11 గంటలకు ఇల్లందు చండ్ర కృష్ణమూర్తి మెమోరియల్ ట్రస్ట్ భవనంలోఇఫ్టు ఆధ్వర్యంలోజరిగే ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ రాష్ట్ర అధ్యక్షులు షేకేయాకుబ్ షావలి ఈరోజు రైల్వేసైడింగ్ స్టోర్ జిఎం ఆఫీస్ కన్వీనియన్స్ వెహికల్ డ్రైవర్ల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని ఒప్పందం చేసుకొని నేటి వరకు ఆ సమస్యలు సమస్యలుగానే మిగిలి ఉన్నాయన్నారు. రైల్వేసైడింగ్ లో పనిచేస్తున్న కార్మికులకు పెరిగిన డిఏ ఏరియర్స్ కార్మికులకు ఇంతవరకు అందడం లేదన్నారు. కన్వీనియన్స్ వెహికల్ డ్రైవర్లకు జీతాలు చెల్లించలేదని. వారి కాంట్రాక్టర్లను అడగగా సింగరేణి యాజమాన్యం బిల్లులు చేస్తా లేదన్నారు. ఓనర్లు బిల్లులు రాకపోవడం వలన డ్రైవర్లకు జీతాలు డిజిలు కిస్తీలు కట్టలేక ఎవరికి చెప్పుకోలేక దీనికి పరిష్కారమే దొరకక నరకయాతన పడుతున్నారని అన్నారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు ఒకపక్క కార్మికుల జీతాలు పెంచడం లేదు సమస్యల్ని పరిష్కరించడం లేదు చట్టబద్ధ హక్కుల్ని అమలు చేసే ఒక ప్రభుత్వ రంగ సంస్థ అయినా సింగరేణిలో అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలన్నారు రేపు ఇల్లందులో జరిగే ప్రగతిశీలసింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర జనరల్ బాడీ జరుగుతుందని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు విజ్ఞప్తి చేశారు.

తాజావార్తలు