రేపు కోటగిరి మార్కెట్ పాలక మండలి ప్రమాణ స్వీకారం.
కోటగిరి డిసెంబర్ 23 జనం సాక్షి:-మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణంలో ఈనెల 24వ తేదీన కోటగిరి మండల మార్కెట్ యార్డ్ నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు ఉమ్మడి కోటగిరి మండల భారాస పార్టీ అధ్యక్షులు ఎజాస్ ఖాన్ తెలిపారు.శుక్రవారం రోజున విలేకరుల తో ఆయన మాట్లాడుతూ గత పాలకవర్గ పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం కొత్త కమిటీని నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు.ఈ నూతన పాలకవర్గ సభ్యుల పదవి కాలం ఉత్తర్వులలో పేర్కొన్న విధంగా రెండేళ్ల పాటు ఉంటుందని అన్నారు.మార్కెట్ కమిటీ చైర్మన్గా మొహమ్మద్ అబ్దుల్ హమీద్,వైస్ చైర్మన్ గా చెన్నూర్ రాం రెడ్డి,డైరెక్టర్లుగా పాకల లక్ష్మణ్,గైని తిప్పయ్య, ఎస్.కె సందానీ,శ్రీ గంగా,మూడ్ చందర్,వెనిగళ్ల సుధీర్ కుమార్,దూమాల అర్జున్ రావు,కే.సంతోష్, సిఎచ్ నీలకంఠారావు,చింతల్వార్ హనుమంతు, ఎండి తన్వీర్,పోలా విఠల్ సేట్,పిఎసిఎస్ కోటగిరి చైర్మన్ కూచి సిద్దు,డిస్టిక్ మార్కెటింగ్ ఆఫీసర్ ఆఫీసర్,అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కోటగిరి, కోటగిరి సర్పంచ్ పత్తి లక్ష్మణ్ లకు కమిటీలో చోటు దక్కిందన్నారు.తెలంగాణ రాష్ట్ర శాసన సభా పతి పోచారం శ్రీనివాస్ రెడ్డి,ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి,రాష్ట్ర బిఆర్ఎస్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వీరంతా ప్రమాణస్వీకారం చేస్తారని తెలిపారు.తదనంతరం కోటగిరి మండలంలోని జల్లాపల్లి ఆభాది గ్రామ నూతన గ్రామపంచాయతీ భవన ప్రారంభోత్సవం ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు,రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు.




