Wednesday, 4 November 2026

రేపు భేటీ కానున్న టీ.కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకునే దిశగా టీ. కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో టీ. కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు రేపు ఉదయం 11.00 గంటలకు నగరంలోని మంత్రుల నివాసంలో సమావేశం కానున్నారు. టీ. కాంగ్రెస్‌ ఎంపీలు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర నేతలు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. అయితే తెలంగాణ కోసం పోరాడుతున్న వివిధ ప్రజా సంఘాల నేతలు కూడా ఆ సమావేశానికి హాజరుకానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *