ప్రకాశం : పెళ్లికి పేరుతో మహిళలను మోసం చేస్తున్న నిందితుడు చంద్రశేఖర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా కొండేపికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి 11 మంది మహిళలను పెళ్లిళ్ల పేరుతో మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ. 11లక్షలు స్వాధీనం చేసుకున్నారు.




