రేవంత్ రెడ్డి ఒక దేశద్రోహి…
– ఆయనకు అంత డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో చెప్పాలి
– చంద్రబాబు అడుగుజాడల్లో నడిచి వేలకోట్లు సంపాదించాడు
– రేవంత్‌ను ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలి
– టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ డిమాండ్
హైదరాబాద్, సెప్టెంబర్28(జనంసాక్షి) : రేవంత్‌రెడ్డి ఒక దేశ ద్రోహిఅని, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడుగుజాడల్లో నడిచి వేలకోట్ల రూపాయలను రేవంత్‌రెడ్డి సంపాదించాడని టీఆర్‌ఎస్ పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్ ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రేవంత్‌రెడ్డిపై ఐటీ దాడుల విషయంలో కాంగ్రెస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ఈ విషయానికి టీఆర్‌ఎస్‌కు సంబంధం లేదన్నారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న జానారెడ్డి, జైపాల్‌రెడ్డి ఇళ్లల్లో ఐటీ సోదాలు జరగడంలేదే.. అన్నారు. వందల, వేల కోట్ల ఆస్తులు రేవంత్‌రెడ్డికి ఎలా వచ్చాయని, రేవంత్‌రెడ్డి ఒక దేశ ద్రోహి అని, ఇతని వ్యవహారంపై ఎలక్షన్ కమిషన్‌ను కలుస్తామని, ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని కోరతామన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన 50లక్షలపై ఆరా తీస్తే డొంకంత కదిలిందని, దేశ భక్తుడినని చెప్పుకునే ఉత్తమ్ కుమార్ రెడ్డి హవాలా మార్గంలో డబ్బులు సంపాదించిన రేవంత్‌ను ఎలా సమర్ధిస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్‌ను కాంగ్రెస్ నుంచి బహిష్కరించి రాహుల్ తన సచ్చిలతను నిరూపించుకోవాలన్నారు.