Thursday, 5 November 2026

సత్యాగ్రహ దీక్ష చేసిన కాంగ్రెస్ నాయకుడు గజ్జల స్వామి..

ధర్మపురి ( జనం సాక్షి ) ధర్మారంలో సత్యాగ్రహ దీక్ష చేసిన గజ్జల స్వామి రాహుల్ గాంధీ పై బిజెపి ప్రభుత్వం కుట్రపూరితంగా వారి అనుచరులతో అక్రమ కేసు వేయించారు. రాహుల్ గాంధీ పై దేశవ్యాప్తంగా ప్రజలలో పెరుగుతున్న అభిమానాన్ని ఓర్వలేక అనేక కుట్రలు పన్నుతున్నారు.నరేంద్ర మోడీ అనేక వేదికలపై అనేక విధాలుగా విమర్శలు చేసిన రాహుల్ గాంధీ పెద్ద మనసుతో ఆయన విజ్ఞతకు వదిలిపెట్టారు.కాంగ్రెస్ కార్యకర్తలు మరియు నాయకులు కూడా ఎటువంటి పట్టింపులకు పోకుండా రాహుల్ గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు.ఈ బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేపట్టకుండా రాహుల్ గాంధీ ని విమర్శించడమే వారి ప్రథమ పనిగా పెట్టుకున్నారు. దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు కరణ పేరుమీద అదానికి అమ్మేస్తున్నారు,దానిని వేలు ఎత్తి చూపినందుకు ఇన్ని అక్రమ కేసులు ఒత్తిడి పెంచుతున్నారు, రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం వారి నానమ్మ, నాన్న ప్రాణ త్యాగాలు చేసినారు ఈ విషయం మోడీకి కనిపించడం లేదు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ పేరిట రైతులను మోసం చేస్తుంది 24 గంటలు నిరాటంకమైన కరెంట్ అని చెప్పి తొమ్మిది గంటలు కరెంటు మాత్రమే ఇస్తుంది.రైతులకు ఆటోమేటిక్స్ స్టార్ట్ మోటర్లు పీకేసినారు.తెలంగాణ ప్రజలు ఏం అయితే కోరుకున్నారో ఈ బి ఆర్ ఎస్ పార్టీ అది అందించలేదు.కెసిఆర్ నోట వచ్చిన మాటలని ఒట్టి మాటలు అయ్యాయి.రైతుకు రావలసిన రాయితీలు ఇంతవరకు ఇవ్వలేదు.
గడిచిన ఈ తొమ్మిది సంవత్సరాలలో బిఆర్ఎస్ పార్టీ విద్యుత్ సంస్థలకు 60 వేల కోట్ల రూపాయల తెలంగాణ ప్రజల పై అప్పు చేసి పెట్టారు. బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న మోసాలను ప్రజలు తెలుసుకునే రోజులు వచ్చినాయి.కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి వేలి బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజేస్తాం. కెసిఆర్ కి ప్రజలు బుద్ధి చెప్పే సమయం చాలా దగ్గరగా ఉంది. డిమాండ్స్ విద్యుత్ బిల్లులో పేద ప్రజలపై వేస్తున్న అపరాధపు పనులను వెంటనే రద్దు చేయలి వసూలు చేసిన అపరాధ బిల్లులను వెంటనే వాపస్ చేయాలి.
తెల్ల కార్డులు , బిపిఎల్ కార్డులు కలిగిన వారికి ఫ్రీగా మీటర్ బిగించాలి.
ట్రాన్స్ఫార్మర్ల వద్ద సేఫ్ గార్డ్ ఏర్పాటు చేయాలి ,అలా చేయకుండా విద్యుత్ ప్రమాదం జరిగితే వారికి ఉచిత ప్రమాద బీమా చెల్లించాలి. ప్రతి ట్రాన్స్ఫార్మర్ వద్ద సేఫ్టీ లాక్ వేసి ఉంచి రైతులకు అనుకూల విధంగా విద్యుత్ సప్లై చేయాలి.
గజ్జల స్వామి కాంగ్రెస్ పార్టీ ధర్మపురి నియోజకవర్గoఎక్స్ ఎంపీటీసీ పాలకుర్తి రాజేశం , రూప్లాల నాయక్ , దేవేందర్ రెడ్డి , కొరెల్లి రెడ్డి , ఇదుల శ్రీనివాస్ , కర్రెడ్డి వేణుమాధవ్, తుమల తిరుపతి , పాలకుర్తి సాయి వినీత్, గుమ్ముల సాయి,అంజి, ఇడుల సాయి, నంది రెడ్డి , సత్తయ్యకుమార్ నాయక్ రేవంత్ రెడ్డి అలియాస్ రవి పెరిక పల్లి గ్రామ ఉపసర్పంచ్ తిరుపతి కాంగ్రెస్ పార్టీ గ్రామ ఉపాధ్యక్షులు ఈర్ల రాజు తదితరులు పాల్గొన్నారు.