రేవ్‌పార్టీ దుమారం

తెలుగు నటికి బ్లడ్‌ శాంపిల్స్‌లో డ్రగ్‌ పాజిటివ్‌
వెలుగులోకి ఒక్కొక్కరుగా..
నమూనాలా ఆధారంగా చర్య తీసుకునే ఛాన్స్‌
బెంగళూరు, మే 23 (జనంసాక్షి) : బెంగుళూరు శివార్లలో జరిగిన రేవ్‌ పార్టీలో రోజు రోజుకీ కొన్ని సంచలన విషయాలు బయటపడుతున్నాయి. రేవ్‌ పార్టీలో పాల్గొన్న నటి హేమ బ్లడ్ల్‌ఓ డ్రగ్స్‌ నమూనాలు ఉన్నట్లు
గుర్తించారు. రేవ్‌ పార్టీలో పాల్గొన్నా వారందరి రక్త నమూనాలు సేకరించిన బెంగుళూరు పోలీసులు పరీక్షకి పంపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అందులో టాలీవుడ్‌ నటి హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్‌ ఉన్నట్లు నార్కొటిక్‌ టీమ్‌ పేర్కొంది. ఇప్పుడు ఈ విషయంతో రేవ్‌పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని హేమ చెప్పిన మాటలు అన్ని అబద్దాలే అని తేలిపోయింది. ఈ రేవ్‌ పార్టీ తరువాత హేమ తాను అక్కడ లేనట్టుగా చిత్రీకరించడానికి బిర్యానీ ఎలా చేస్తారు లాంటి మామూలు వీడియోలు విడుదల చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఇప్పుడు ఆమె రక్త నమూనాలో మాదకద్రవ్యాలు తీసుకున్నట్టుగా రూఢీ కావటంతో ఇక ఆమె ఎన్ని చెప్పినా, ఆమె ఆ పార్టీలో వుంది, మాదకద్రవ్యాలు సేవించింది అనే విషయం స్పష్టం అయింది. ’సన్‌ సెట్‌ టు సన్‌ రైజ్‌ విక్టరీ’ పేరుతో బెంగళూరు ఎలక్టాన్రిక్‌ సిటీ జీఆర్‌ ఫామ్‌ హౌస్‌లో గత ఆదివారం రేవ్‌పార్టీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రేవ్‌పార్టీలో పాల్గొన్న 103 మంది రక్త నమూనాలను ఇటీవల బెంగళూరు నార్కొటిక్‌ టీమ్‌ సేకరించింది. 103 మందిలో మొత్తం 86 మంది డ్రగ్స్‌ తీసుకున్నట్లు తేలింది. 59 మంది పురుషుల, 27 మంది మహిళల రక్త నమూనాలు పాజిటివ్‌ అని తేలింది. నటి హేమ కూడా డ్రగ్స్‌ తీసుకున్నట్లు నిర్దారణ అయింది. రక్త నమూనాలు పాజిటివ్‌గా తేలిన వారందరికీ సీసీబీ సమన్లు జారీ చేయనుంది. అదే రేవ్‌పార్టీ జరిగిన ఫామ్‌హౌస్‌లోనే నటి హేమ ఉందని, ఆమె వీడియో అక్కడే రికార్డ్‌ చేసిందని బెంగళూరు పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.
తాను రేవ్‌పార్టీలో పాల్గొనలేదని, ఆ సమయంలో హైదరాబాద్‌లోనే ఉన్నానని హేమ అప్పట్లో ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే రేవ్‌పార్టీకి తాను వెళ్లలేదంటూ రిలీజ్‌ చేసిన వీడియోలో ఆమె ఏ డ్రస్‌తో ఉన్నారో, బెంగళూరు పోలీసులు విడుదల చేసి ఫొటోలోనూ అదే డ్రస్‌లో ఉన్నారు. దాంతో హేమ చెప్పేది అబద్ధం అని అప్పుడే స్పష్టం అయింది. అయినా కూడా హేమ తాను హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ మరో వీడియో వదిలారు. చివరకు బ్లడ్‌ శాంపిల్స్‌ పాజిటివ్‌గా రావడంతో ఆమె బండారం బయటపడిరది.డ్రగ్స్‌ టెస్ట్‌లో హేమకి పాజిటివ్‌ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. హేమతో పాటు డ్రగ్స్‌ టెస్ట్‌లో మొత్తం 86 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు పోలీసులు ప్రకటించారు. హేమను బాధితురాలుగా పరిగణించే అవకాశముంది.