*వైయస్ షర్మిలపై తెరాస కార్యకర్తలు దాడి చేయడం హేయమైనా చర్య*
*కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి దేవి
మెట్పల్లి టౌన్ ,నవంబర్ 28 ,
జనం సాక్షి:
తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పాదయాత్ర సాగిస్తున్నా వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి,అధ్యక్షురాలు వైయస్ షర్మిలపై తెరాస నాయకులు కార్యకర్తలు దాడి చేయడం హేయమైన చర్య అని కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి దేవి ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారు. నేడు ఆమె మెట్పల్లిలోని స్థానిక విలేకరులతో ఫోన్ ద్వారా మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సు కోరి ప్రజాస్వామ్య బద్దంగా జరిగే ఏ పార్టీకి చెందిన పాదయాత్రలైనా, ఏ ఇతర కార్యక్రమాలనైన ప్రభుత్వం ఏదో ఒక సాకు చెప్పి అణచివేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని, సీఎం కేసీఆర్ నిరంకుశ ధోరణికి ఇదొక మచ్చుతునక మాత్రమే నని మండిపడ్డారు. దీనిని బట్టే ప్రభుత్వం తెలంగాణలో మహిళలకు ఏ పాటి గౌరవం ఇస్తుందో తేలిపోయిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జూట మాటలతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ కట్టబెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని స్పష్టం చేశారు
వైయస్ షర్మిలపై తెరాస కార్యకర్తలు దాడి చేయడం హేయమైనా చర్య




