Wednesday, 4 November 2026

రైతులను మోసం చేస్తున్న బిఆర్ఎస్!

– బిఆర్ఎస్ ప్రభుత్వం రైతు దినోత్సవం పేరిట మరొక సారి మోసం చేయడానికి పూనుకున్నదని బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాద్ వెర్రబల్లి పేర్కొన్నారు! తరుగు పేరుతో ధాన్యాన్ని దోచుకుంటున్నారు,ధాన్యం తడిసిందని కొనడం లేదు,అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం లేదు,రుణ మాఫీ,ఫసల్ భీమా లేదు అన్నారాయన,కొనుగోలు చేసిన ధాన్యానికి సరిగా చెల్లింపులు లే వన్నారు! రైతులకు అన్నీ నష్టాలు,కష్టాలే కల్పిస్తున్న బిఆర్ఎస్ రైతు దినోత్సవం ఎందుకోసం జరుపుతుందని రఘునాద్ ప్రశ్నించారు!